ఇద్దరు మావోయిస్టులు మృతి
మందుపాతర్లను నిర్వీర్యం చేసిన భద్రతాబలగాలు
నవతెలంగాణ-చర్ల
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా సౌత్ బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారని బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ బస్తర్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు బుధవారం డీఆర్డీ బలగాలకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో గురువారం ఉదయం ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47 తుపాకీ, 9 ఎంఎం తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది. ఇదిలా ఉంటే బీజాపూర్ జిల్లా లంకపల్లి రహదారిపై మావోయిస్టులు అమర్చిన రెండు భారీ మందుపాతర్లను కేంద్ర బలగాలు గుర్తించి, నిర్వీర్యం చేశాయి. వాటి బరువు 50 కేజీలుంటుందని పోలీసులు చెబుతున్నారు.
బీజాపూర్ అడవుల్లో ఎన్‌కౌంటర్
- Advertisement -
- Advertisement -



