అక్రమంగా వేసుకున్న గుడిసెల తొలగింపు: ఎఫ్.డి.ఓ రామ్మోహన్
నవతెలంగాణ – జన్నారం
అటవీ భూములను ఆక్రమిస్తే వన్యప్రాణి చట్టం, అటవీ చట్టం ద్వారా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జన్నారం ఎఫ్.డి.ఓ రామ్మోహన్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని అటవీ శాఖ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం డివిజన్ ఇంధన పెళ్లి రేంజ్ కవ్వాల్ సెక్షన్ లోని 249 కంపార్ట్మెంట్లో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పలువురు గిరిజనులు 3 సంవత్సరాలగా అక్రమంగా వేసుకున్న తొమ్మిది గుడిసెలను మంచిర్యాల జిల్లాలోని వివిధ డివిజన్లకు చెందిన అటవీ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సహాయముతో వన్యప్రాణి చట్టాలు, అటవీ చట్టాలను అనుసరించి 10 టీమ్ లుగా ఏర్పడి తొలగించినట్లు తెలిపారు.
అంతేకాకుండా వారు అక్రమంగా నరికిన దాదాపు 350 టేకు చెట్లు, అక్రమంగా వేసుకున్న తొమ్మిది గుడిసెల స్థలములో బెదురు మొక్కలను నాటుతామని తెలిపారు. అలాగే కందకాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వారు మళ్లీ రాకుండా వారు వచ్చే దారులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ భూములను ఆక్రమించాలని చూస్తే అటవీ చట్టాలు వన్యప్రాణి చట్టాలను అనుసరించి వారి పైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జన్నారం, ఇంధనపెల్లి రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధరా చారి లు పాల్గొన్నారు.
అటవీ భూములను ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES