Sunday, October 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు 

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాలలో బతుకమ్మ ఆడే ప్రదేశాలలో ముందు రోజే గ్రామపంచాయతీ సిబ్బంది పూర్తిగా శుభ్రం చేసి లైటింగ్ సౌకర్యం కల్పించారు.  మహిళలు ఉదయం సేకరించిన రంగురంగుల తంగేడు  పూలను మొదలుకొని ఇతర పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించి గౌరమ్మ తల్లిగా  కొలిచారు. అనంతరం సాయంత్రం వేళ ఆయా గ్రామాలలోని చెరువుగట్లు కాలువగట్లు వాగు ల వెంట దేవాలయాల వద్ద బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ కోలాటం ఆడుతూ గౌరమ్మను మనస్పూర్తిగా కొలిచారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని చెరువులు కుంటలలో కాలువలను నిమజ్జనం చేసి నైవేద్యాన్ని ప్రజలకు పంపిణీ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -