నవతెలంగాణ- అబ్దుల్లాపూర్ మెట్
బైక్‌ను లారీ ఢకొీట్టడంతో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన బందెల నర్సింహా కూతురు హంసలేఖ(22) బ్రిలియంట్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మంగళవారం స్నేహితులతో కలిసి మౌంట్ ఓపెరా నుంచి పల్సర్ బైక్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ వైపు వెళ్తుండగా సింగరేణి కాలనీ వద్ద ఎదురుగా వచ్చిన యాక్టివా టూ వీలర్ వాహనం వారి బైక్‌ను ఢకొీట్టింది. దీంతో వారు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో ఘట్‌కేసర్ వెళ్తున్న లారీ (బాటసింగారం ఫ్లై ఓవర్ వద్ద యూ-టర్న్ తీసుకోవడానికి వెళ్తూ) వారిని బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో హంసలేఖ తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢకొీని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



