సీఐటీయూ పోరాట ఫలితం ..

The result of the CITU struggle..– తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను విధుల్లోకి తీసుకున్న అధికారులు

– పోరాటాల ద్వారా విజయం సాధించిన కార్మికులకు జై జైలు: సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సీఐటీయూ పోరాట ఫలితంగానే తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను అధికారులు విధుల్లోకి తీసుకున్నారని నిజామాబాద్ జిల్లా సీఐటీయూ కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..ఆర్మూర్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని గత వారం రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనలో నిర్వహించి అధికారులపై ఒత్తిడి తేవడంతో శనివారం రోజు అధికారులు స్థానిక ఆర్మూర్ ఎమ్మార్వో మున్సిపల్ కమిషనర్, ఎంఈఓ, హెడ్మాస్టర్ చర్చించుకుని యూనియన్ నాయకులతో చర్చలు జరిపి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవటానికి అంగీకరించే ఒప్పందం చేసుకోవడం జరిగింది. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మార్వో కార్యాలయం తో పాటు బాలికల పాఠశాల ముందు ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు జరిగింది. అదేవిధంగా శాఖ అధికారికి, జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు ఇవ్వటంతో పాటు 18 తేదీన చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రచారం చేయటం జరిగింది. దీంతో అధికారులు స్పందించి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నందున సీఐటీయూ వారికి ధన్యవాదాలు తెలుపటం జరిగింది. ఇప్పటికైనా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఏజెన్సీ కార్మికులపై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ,అధికారులు వేధింపులను. కార్మికుల బకాయి బిల్లులను సకాలంలో చెల్లించాలని నెల నెల వేతనాలు ఇవ్వాలని కనీస వేతనాలను అమలు జరిపి ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ ముత్యాల భోజన ఏజెన్సీ కార్మిక నాయకులు సుజాత, సిఐటియు ఆర్మూర్ కార్యదర్శి ఎల్లయ్య మధ్యాహ్న భోజన, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ నాయకులు కటారి రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love