Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకొత్త సన్నివేశాలతో 'పెద్ది

కొత్త సన్నివేశాలతో ‘పెద్ది

- Advertisement -

'‘పెద్ది’ సినిమాలో కొత్త సన్నివేశాలు జోడిస్తున్నాం. ఆల్రెడీ ఎడిట్ చేశాం. ఈ బుధవారం నుంచి యాడ్ అవుతాయి. మొత్తం మూడు సన్నివేశాలు జోడించాం. హీరోయిన్‌కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబుకి ఒక సీన్ ఉంటుంది. మిస్ అయిన అంశాలన్నీ అందులో ఉంటాయి అని దర్శకుడు బుచ్చిబాబు సానా తెలిపారు.
రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు.
ఈనెల 4న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది సౌత్ ఇండియా నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది. అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయ వంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ,’95 శాతం మంది ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్, కథ గొప్పతనం, రామ్ చరణ్ నటనను ప్రశం సించారు. ఇలాంటి కథలు మరిన్ని రావాలని కోరుకున్నారు. మేము నమ్మిన దానిని ప్రేక్షకులు నిజం చేశారు. మేము వెళ్లిన ప్రతి థియేటర్‌లో అద్భుతమైన స్పందన లభించింది. కొత్తగా జోడించే సన్నివేశాలలో జాన్వీ పాత్రకు సంబంధించి రెండు సన్నివేశాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ పాత్రకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. దాంతో జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను. అలాగే ఆదివారం నుంచే టికెట్ ధరలు తగ్గించాం. చిరంజీవి, సురేఖ సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ‘చాలా అద్భుతమైన సినిమా తీశావుఅని ప్రశంసించారు. మా నిర్మాత సతీష్ ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే లక్ష్యంతో ఎక్కడా రాజీపడలేదు అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -