నయా సస్పెన్స్ థ్రిల్లర్ ‘రిస్క్ప్రపంచవ్యాప్తంగా ఈనెల 26న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ చిత్రంలోని మెలోడీయస్ సాంగ్ 'దేవుడు వరమందిస్తే ను డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు గంతాడి కృష్ణ, హీరో సందీప్ అశ్వ, నిర్మాతలు రవి సురేష్ రెడ్డి, గుర్రం నర్సిములు, కో-ప్రొడ్యూసర్ గడ్డం రవి కుమార్, కో-డైరెక్టర్ బన్సీ కోయల్ కార్ పాల్గొన్నారు. అలాగే “దేవుడు వరమందిస్తే” పాటకు సంబంధించిన హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తే బెస్ట్ వీడియోలకు మేకర్స్ ప్రత్యేక నగదు బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది. సందీప్ అశ్వ, సాన్యా ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకి సంగీతం, దర్శకత్వం: ఘంటాడి కృష్ణ, ఛాయాగ్రహణం: జగదీష్ కొమరి, నిర్మాతలు: రావి సురేష్ రెడ్డి, గుర్రం నర్సిములు, సహ నిర్మాత: గడ్డం రవి కుమార్.
ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ‘రిస్క్`
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


