Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపటి నుండి పాఠశాలలు పున: ప్రారంభం

రేపటి నుండి పాఠశాలలు పున: ప్రారంభం

- Advertisement -

ఫస్ట్ ఫేసులో 7 మండలాలలో విద్యార్థులకు అల్పాహారం
నవతెలంగాణ-వర్ధన్నపేట

రేపటి నుండి విద్య సంస్థలు ప్రారంభం కానున్నాయి. 2026-27కి గానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదటి ఫేస్ లో జిల్లాలోని 7 మండలాల్లో పైలెట్గా తీసుకొని అల్పాహారం పథకం ప్రారంభించారు. ఫస్ట్ ట్రైల్ అనంతరం అన్ని మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ప్రారంభించనుంది. వర్ధన్నపేట మండలంలో ప్రాథమిక ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ పాఠశాలలో 13 82 మంది విద్యార్థులతో పాటు జూనియర్ కళాశాలలో సైతం అల్పాహారం పథకం ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు సకాలంలో హాజరుకావాలని ప్రైవేట్ కన్నా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో పాటు, నాణ్యమైన విద్యను అందిస్తుందని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. మండలంలోని అన్ని పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, తల్లిదండ్రులు విద్యార్థులతో పాఠశాలకు హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని, వర్ధన్నపేట ఎంఈఓ మామునూరు శ్రీధర్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -