Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు

- Advertisement -

– ఆయిల్, కాపర్ సామాన్లు, ఇతర సామాగ్రి అపహరణ
నవతెలంగాణ – జుక్కల్ 

మండల పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్తు నియంత్రికలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, కాపర్, ఆయిల్ ను చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక వ్యవసాయ దారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెండేగావ్ గ్రామంలో ఆగస్టు 5న రెండు, పడంపల్లి గ్రామంలో ఒక విద్యుత్ నియంత్రికలను, ఆగస్టు 13న విద్యుత్ ప్రవహిస్తున్న వైరును కత్తిరించి, నియంత్రికలను ధ్వంసం చేసి అందులో విలువైన ఆయిల్, కాపర్, విలువైన సామాగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు.

ఈ విషయమై ఆయా గ్రామాలకు చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సంబంధిత ట్రాన్స్కో అధికారులకు, గ్రామ కార్యదర్శికి సమాచారం అందించారు. గతంలో కూడా ఒక్క రోజులోనే పడంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రాలలో ఐదు ట్రాన్స్ఫర్లు దొంగిలించబడ్డాయి. విద్యుత్తు నియంత్రికల దొంంగతనాలకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో తరచుగా రాత్రిపూట పోలీసులు గస్తీ కాస్తే తప్ప ఈ దొంగతనాలను అరికట్టలేమని అభిప్రాయపడ్డారు. వెంటనే పోలీస్ శాఖ స్పందించి, సమస్య పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -