Friday, August 14, 2026
E-PAPER
Homeజాతీయంఎర్రకోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

ఎర్రకోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: రేపు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ పోలీసులు వాహనాదారులకు కీలక సూచనలు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పలు మార్గాల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిపి వేయబడతాయని తెలియజేశారు. ఉదయం 4 గంటల నుంచి10 గంటలకు వరకు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలో ఉంటాయని వెల్లడించారు. ముందస్తు అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే రాకపోకలకు షర్మిట్ ఉంటుందని పోలీసులు తెలియజేశారు.

ఢిల్లీ గేట్ టూ ఛత్తా రైల్ చౌక్ మధ్య నేతాజీ సుభాష్ మార్గ్, జిపిఓ ఢిల్లీ, ఛత్తా రైల్ చౌక్ మధ్య లోథియన్ రోడ్, హెచ్‌సి సేన్ మార్గ్, యమునా బజార్ చౌక్ మధ్య ఎస్.పి. ముఖర్జీ మార్గ్, ఫౌంటెన్ చౌక్ – రెడ్ ఫోర్ట్ మధ్య చాందినీ చౌక్ రోడ్, రింగ్ రోడ్ – నేతాజీ సుభాష్ మార్గ్ మధ్య నిషాద్ రాజ్ మార్గ్, నేతాజీ సుభాష్ మార్గ్ వైపు వెళ్లే ఎస్ప్లనేడ్ రోడ్ , లింక్ రోడ్, రాజ్‌ఘాట్- ఐఎస్‌బిటి కాశ్మీర్ గేట్ మధ్య రింగ్ రహదారులో ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని ప్రకటించారు. వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, ఆంక్షలు ఉన్న రోడ్లకు దూరంగా ఉండాలని, ప్రయాణానికి అదనపు సమయం కేటాయించుకోవాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -