Friday, August 14, 2026
E-PAPER
Homeజాతీయంరాహుల్‌ గాంధీకి భారీ ఊరట..

రాహుల్‌ గాంధీకి భారీ ఊరట..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సావర్కర్‌పై వ్యాఖ్యలకు సంబంధించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగుతున్న క్రిమినల్‌ పరువునష్టం కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కేసు కొనసాగించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అనుమతి పొందలేదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ షీల్‌ నాగు ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అవసరమైన ప్రభుత్వ అనుమతి లేకుండా కేసు కొనసాగించలేమని పేర్కొంటూ రాహుల్‌ గాంధీ పిటిషన్‌ను అనుమతించింది. దీంతో దిగువ కోర్టు జారీ చేసిన సమన్లను కూడా రద్దు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -