Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుRoad Accident: రోడ్డు ప్రమాదంలో యువకుడు ‌మృతి

Road Accident: రోడ్డు ప్రమాదంలో యువకుడు ‌మృతి

- Advertisement -

మరొకరికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ-డిచ్ పల్లి 

డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 సిఎంసి మెడికల్ కాలేజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరంలోని పులంగ్ కు చెందిన మెట్టు రామ్ ధనుష్ (19) అక్కడికక్కడే మృతి చెందారు. మరొక యువకుడు గచ్చకాయల తేజ తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సుద్దపల్లి గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ వైపు వెళ్తుండగా.. హైదరాబాద్ వైపు నుండి అర్ముర్ వైపు వేళ్తున్న ఒక కారు సిఎంసి మెడికల్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఢీకొందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ధనుష్ అక్కడి కక్కడే మృతి చెందగా.. గచ్చకాయల తేజకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి‌ తరలించినట్లు తెలిపారు. ప్రమాదనికి కారణమైన కారు ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ హెచ్ ఓ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -