Friday, August 14, 2026
E-PAPER
Homeజిల్లాలుఎరువుల పంపిణీలో నూతన విధానం

ఎరువుల పంపిణీలో నూతన విధానం

- Advertisement -

వ్యవసాయ అధికారి సిద్ధార్థ 
నవతెలంగాణ-మిడ్జిల్ 

రైతులకు ఎరువులు పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా, సులభతరంగా, వేగంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా “ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ ఎఫ్ ఎఫ్ ఎస్  అనే నూతన డిజిటల్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిందని మండల వ్యవసాయ అధికారి సిద్ధార్థ చెప్పారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో నవ తెలంగాణతో ఆయన మాట్లాడారు.

ఆగస్టు 17 నుండి మిడ్జిల్ మండలంలోని రైతులకు ఎరువుల పంపిణీ పూర్తిగా ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ ద్వారానే ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానానికి భిన్నంగా, ఇకపై రైతులు తమ సాగు అవసరాలకు అనుగుణంగా ముందుగానే యాప్‌లో నమోదు చేసుకుని ఎరువులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రైతులకు సూచించారు. రైతు వివరాలు, సాగు భూమి, పంట వివరాలు, అవసరమైన ఎరువుల సమాచారం ఆధారంగా ఎరువుల పంపిణీ ప్రక్రియ జరుగుతుంది అని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువుల ప్రణాళిక మరింత సమర్థవంతంగా రూపొందించబడటంతో పాటు పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది అని చెప్పారు.

నవతెలంగాణ: ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో రైతులు ఎలా నమోదు చేసుకోవాలి
వ్యవసాయ అధికారి: అధికారిరైతులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లో గూగుల్ స్టోరేజ్ ద్వారా ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలని తెలిపారు. ఫార్మర్ ఐడి ఉన్న రైతులు ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటిపి ద్వారా తమ వివరాలను ధృవీకరించుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతు భూమి వివరాలు  యాప్‌లో అందుబాటులోకి వస్తాయి తెలిపారు. ఫార్మర్ ఐడి లేని రైతులు ఆధార సంఖ్యతో పికేవైసీ పూర్తి చేసి ఓటిపి ధ్రువీకరణ అనంతరం నమోదు ప్రక్రియను చేసుకోవచ్చని సూచించారు.

నవతెలంగాణ: భూమి వివరాలు కనిపించకపోతే ఏం చేయాలి?
వ్యవసాయ అధికారి: కొంతమంది రైతుల భూమి వివరాలు ఫార్మర్ రిజిస్టర్లో అందుబాటులో లేకపోవచ్చు, అలాంటి సందర్భాల్లో యాప్‌లో ఉన్న  సైనిక్ ల్యాండ్ స్ ఫార్మర్ రిజిస్టర్లో సదుపాయం ఉపయోగించిన భూమి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. రైతులు పంట వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.

భూమి వివరాలు నమోదు పూర్తయిన తర్వాత రైతులు ప్రస్తుత సీజన్‌లో సాగు చేయబోయే పంటను తప్పనిసరిగా ఎంపిక చేయాలి. అనంతరం ఏ భూమికి ఎరువులు అవసరమో ఆ భూమిని ఎంపిక చేసి, ఆయా పంటలకు అవసరమైన ఎరువుల వివరాలను నమోదు చేయాలి అని పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా రైతుల వివరాలు, సాగు భూమి, సాగు పంట ఆధారంగా ఎరువుల అవసరాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు అని తెలిపారు.

యాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు లేదా నమోదు సంబంధిత ఇబ్బందులు ఎదురైనట్లయితే, తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ఏ ఈ ఓ  లేదా ఎరువుల విక్రయ కేంద్రాలను సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చు రైతులకు సూచించారు. రైతులు ఈ నూతన విధానాన్ని సద్వినియోగం చేసుకొని, 2026 ఆగస్టు 17వ తేదీ నుండి అమలులోకి రానున్న ఎఫ్ ఎఫ్ ఎస్ విధానానికి పూర్తిస్థాయిలో సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -