Sunday, June 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుంచే యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం

రేపటి నుంచే యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం

- Advertisement -

• మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి 
నవతెలంగాణ -పెద్దవంగర
రైతులకు యూరియాను పారదర్శకంగా, సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి యూరియా బుకింగ్ యాప్ ప్రారంభించనున్నట్లు మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు స్వయంగా లేదా ఇతరుల ద్వారా OTP ఆధారంగా యూరియా బుక్ చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. సమీప అధీకృత ఎరువుల డీలర్‌ను ఎంపిక చేసుకుని బుక్ చేసిన యూరియాను 24 గంటల్లోపు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పట్టా పాస్‌బుక్ కలిగిన రైతులతో పాటు, కౌలు రైతులు మరియు పట్టా పాస్‌బుక్ లేని రైతులు కూడా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి బుకింగ్ చేసుకోవచ్చనని పేర్కొన్నారు. భూమి విస్తీర్ణం ఆధారంగా ప్రతి 15 రోజులకోసారి విడతల వారీగా యూరియా జారీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు యాప్‌ను సద్వినియోగం చేసుకుని సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -