ఇటీవల ‘లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్’ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫిబ్రవరి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.సుహాస్ హీరోగా, శివానీ నగరం నాయికగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ స్రవంతి చొక్కారపు ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుంది. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బుధవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయడంతో పాటు ఫిబ్రవరి 20న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా జరిగిన వేడుకలో హీరో సుహాస్ మాట్లాడుతూ,’టీజర్ లాంచ్ అనగానే నాకు మేసేజ్‌లు వచ్చాయి. ఈ సినిమాలో నాది గత సినిమాలతో పోలీస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను చేశాను. ఇక నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి. ఈ సినిమాకు వంశీ నందిపాటి, బన్నీవాస్ యాడ్ అయిన తరువాత మా టీమ్‌కు మంచి బూస్ట్ వచ్చింది. నరేంద్ర రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ ఫిలింగా నిలుస్తుంది. నాకు ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
ఆద్యంతం వినోదభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



