కథానాయకుడు నవీన్ పొలిశెట్టి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, రాబోయే సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుందని చెప్పకనే చెప్పింది. బంగారు ఆభరణాల ప్రకటన స్పూఫ్‌తో ప్రారంభమైన టీజర్ ఆ తర్వాత సినిమాలోని ఉత్సాహభరితమైన దశ్యాలను ఆవిష్కరించింది. నవీన్ అద్భుతమైన హాస్య చతురత, తెరపై ఉత్సాహంగా కనిపించిన తీరు, అలాగే నాయిక మీనాక్షిచౌదరి అందం, అభినయం, పండుగ ఉత్సాహం, రంగురంగుల సెట్లు, మాస్ అంశాలు, కామెడీ, రొమాన్స్ మేళవింపుతో ఎంతో వినోదభరితంగా రూపొందిన ఈ టీజర్ కట్టిపడేస్తోంది. సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన వినోదాల విందుకి వాగ్దానంలా ఈ టీజర్ నిలిచిందని చిత్ర యూనిట్ తెలిపింది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ పొలిశెట్టి రచయిత కావడం విశేషం. ఈ సినిమాతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.
సంక్రాంతికి వినోదాల సందడి
- Advertisement -
- Advertisement -