– మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
జీవకోటి మనుగడ సాధించాలంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్ బి.నాగరాజు అన్నారు. ప్రధానంగా జీవకోటి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన కాలుష్యాన్ని” పూర్తిగా నిర్మూలించాలి అంటే అందుకు ప్రజలలో చైతన్యం తీసుకురావడం మే శిరోధార్యం అన్నారు.బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 – 2026 అంశం పై మున్సిపల్ సిబ్బంది కి అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా ప్రజలకు తడి – పొడి చెత్త నిర్వహణపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆర్పీ(రిసోర్స్ పర్సన్ ల)పై ఉందన్నారు. పట్టణ పరిశుభ్రత మనందరి బాధ్యత, పరిసరాల నిమిత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ శాంతి కుమారి తోపాటు ఆర్పీ లు మున్సిపల్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.



