పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత..

– సర్పంచ్ ద్యావనపల్లి మంజుల
నవతెలంగాణ-బెజ్జంకి
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని సర్పంచ్ ద్యావనపల్లి మంజుల సూచించారు.సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ అవరణం వద్ద పర్యావరణ పరిరక్షణపై గ్రామ ప్రజలకు సర్పంచ్ మంజుల అవగాహన కల్పించారు.గ్రామస్తులతో పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛంద సంస్థలు,వ్యాపారస్తులు పర్యావరణ పరిరక్షణకు తమ వంత చేయూత అందించాల్సిన అవశ్యకత ఉందని సర్పంచ్ కోరారు.వార్డ్ సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు.

Spread the love