నవతెలంగాణ – ఆర్మూర్
లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరపున బాలల దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలోని జెంటిల్ కిడ్స్ స్కూల్ యోగేశ్వర కాలనీలో వ్యాసరచన పోటీలలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులు డి. స్నిగ్ధశ్రీ, 5వ తరగతి, కార్తికేయ 7వ తరగతి, సాయిదుర్గ 4వ తరగతి విద్యార్థులను మెమెంటో, సర్టిఫికెట్ల తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ .. విద్యార్థులు సమాజసేవలో ముందుండాలని సమాజానికి తమ వంతు కృషి చేస్తూ జీవితంలో నిరుపేదలకు తమ వంతు కృషి చేస్తూ సేవా దృక్పథంలో ముందుండాలని చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లీడర్ శ్రీనివాస్ కోశాధికారి గోపి జెంటిల్ కిడ్స్ ప్రకాష్ , రాజేష్ , నసీరుద్దీన్ , చేపూర్ గణేష్ దాచేపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వ్యాసరచన పోటీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



