నవతెలంగాణ – పెద్దవూర
ప్రజల దాహర్తిని తీర్చుటకు చలివేంద్రం ఏర్పాటు చేశామని సిఆర్పీఫ్ జవాన్ రామావత్ లక్ష్యనాయక్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ మండలం జమ్మనకోట తండాలో గ్రామానికి చెందిన సిఆర్పీఫ్ జవాన్ సొంత ఖర్చులతో చలివేద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా లక్ష్యా నాయక్ గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగుతుండతో గ్రామం లో తాగునీటి సమస్య నెలకొందని కావున నా వంతుగా చలివేంద్రం ద్వారా తాగునీటిని అందిస్తునాన్ని తెలిపారు.
వేసవి కాలంలో గ్రామ ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందిలేకుండా చలివేంద్రం ఏర్పాటు చేశానని తెలిపారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీకు, ఎంపీటీసీ హచ్చు నాయక్, శారి,బుచ్చి, పవన్, వార్డు మెంబెర్ శ్రీను, మాజీ సర్పంచి ముని, జమాలా, రమావత్ ముని, రంగనాయక్, కొండ, జమ్మనకోట సర్పంచిశ్రీను నాయక్,తదితరులు పాల్గొన్నారు.



