న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం పేరును కేంద్రం ఇటీవలే మార్చేసిన విషయం తెలిసిందే. ‘వీబీ-జీ రామ్ జీ’ పేరిట తీసుకొచ్చిన బిల్లుకు ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ ఆమోదం తెలిపింది కూడా. అయితే బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి రెండు నెలల ముందే కేవలం 36 రోజుల వ్యవధిలో పథకం రోల్స్ నుంచి 16.3 లక్షల మంది కార్మికులను తొలగించారని అధికారిక డేటా చెబుతోంది. అక్టోబర్ 10-నవంబర్ 14 మధ్యకాలానికి ఈ డేటాను రూపొందించారు. పని చేసే హక్కుకు గ్యారంటీ ఇస్తున్న చట్టం నుంచి లక్షలాది కార్మికులను తొలగించడంపై కార్మిక సంఘాలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
జాబ్ కార్డుల తొలగింపు అనేది నిరంతరం జరిగే ప్రక్రియేనని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 11,07,339 తొలగింపులు జరిగాయి. తెలంగాణలో 95,064 మంది కార్మికుల జాబ్ కార్డులు తొలగించారు. ఒడిషా, జమ్మూకాశ్మీర్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారు. ఆధార్ ఆధారిత కేవైసీ ప్రక్రియ కారణంగానే భారీగా తొలగింపులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఉపాధి సవరణలకు ముందే 16 లక్షల మంది కార్మికులు ఔట్
- Advertisement -
- Advertisement -



