Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీజన్‌ 1 కంటే అద్భుతంగా..

సీజన్‌ 1 కంటే అద్భుతంగా..

- Advertisement -

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన సిరీస్‌ ‘కానిస్టేబుల్‌ కనకం’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ అవసరాల కీలక పాత్రలు పోషించారు.
కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్‌ కుమార్‌ నిర్మించారు. ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘కానిస్టేబుల్‌ కనకం 2′ నేటి (గురువారం) నుంచి ఈటీవీ విన్‌లో రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ,”కానిస్టేబుల్‌ కనకం’ నాకు చాలా ప్రత్యేకం. ఇంత అద్భుతమైన ఎమోషన్‌ ఉన్న స్టోరీకి నన్ను ఎంపిక చేసినందుకు డైరెక్టర్‌ ప్రశాంత్‌కి థ్యాంక్యూ. సీజన్‌ 3 కూడా చేయాలని కోరుకుంటున్నాను. సాయిబాబా, హేమంత్‌ లాంటి ప్రొడ్యూసర్స్‌ ఇండిస్టీలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్లు మరింత అద్భుతమైన కంటెంట్‌ చేయాలని కోరుకుంటు న్నాను.

ఈటీవీలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. మేఘలేఖ నటన ఈ సీజన్లో అదిరిపోతుంది. సురేష్‌ మ్యూజిక్‌ అద్భుతంగా ఉంటుంది. సీజన్‌ 2 అద్భుతంగా ఉంటుంది. చాలా ఎంజాయ్‌ చేస్తారు’ అని తెలిపారు. ‘చిరంజీవి ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో కనకం ప్రయాణం మొదలైంది. సీజన్‌ 2 ఆయన సినిమా థియేటర్‌కి రావడంతో పాటు ముగుస్తుంది. క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉంటాయి. ‘అనగనగా, ఎయిర్‌, కానిస్టేబుల్‌ కనకం, లిటిల్‌ హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయ్‌.. ఇలా ఐదు బౌండరీలు అయ్యాయి. ఇప్పుడు కానిస్టేబుల్‌ కనకం సీజన్‌ 2 కూడా బౌండరీ కాబోతోంది. నిర్మాత సాయిబాబా చాలా ప్యాషన్‌ తో పని చేశారు. ఆయన లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. సురేష్‌ బొబ్బిలి చాలా వైవిధ్యమైన మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ సిరిస్‌కి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. సీజన్‌ 1 కంటే మించి అద్భుతంగా ఉండే సిరీస్‌ ఇది’ అని ఈటీవీ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -