Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాదాలు జరుగుతున్నా..పట్టించుకోరా..?

ప్రమాదాలు జరుగుతున్నా..పట్టించుకోరా..?

- Advertisement -

– అధికారులపై పోతారం గ్రామస్తుల అసహనం
– మట్టితో గుంతలు పూడ్చిన గ్రామస్తులు
నవతెలంగాణ-బెజ్జంకి
: మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి అనుసంధాన రోడ్డు.ఈ రోడ్డు ద్వారా మండల ప్రజలు జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఈ రోడ్డు గుంతలమయమై ప్రమాదకరంగా మారింది.శుక్రవారం పోతరం గ్రామం మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు గుంతల వల్ల ప్రమాదానికి గురయ్యారని గ్రామస్తులు తెలిపారు. అంబులెన్స్ వెళ్లెందుకు వీలులేకుండా రోడ్డు దుస్థితి ఉందని అవేదన వ్యక్తం చేశారు. మండలంలో గుంతలమయమైన రోడ్లకు అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని.. అధికారులు పట్టించుకోరాంటూ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.
గుంతలు పూడ్చిన గ్రామస్తులు..
మండల పరిధిలోని పోతారం గ్రామంలో ప్రమాదకరంగా మారిన రోడ్డుపై గుటతలను గ్రామస్తులు శనివారం మట్టితో పూడ్చారు. గుంతలమయమైన పోతారం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -