– కొనసాగుతున్న ఇజ్రాయిల్ వైమానిక దాడులు
– గాజాలో మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు
గాజా: కాల్పుల విరమణ ఉన్నప్పటికీ.. ఇజ్రాయిల్ మారణకాండ ఆగటం లేదు. గాజాలో మంగళవారం వైమానిక దాడులతో హడలెత్తించింది. గాజా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన బహుళ వైమానిక దాడుల ఫలితంగా అనేక మంది పాలస్తీనియన్లు మరణించారు. షిఫా ఆస్పత్రి అధికారుల సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులూ ఉన్నారని నివేదించారు. గత 24 గంటల్లో ఐదుగురికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు గాజా నగరంలోని పశ్చిమ భాగంలో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రాణనష్టంలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారు. రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఈ దాడులు ప్రజలను తాకాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. షిఫా ఆస్పత్రికి తీసుకువచ్చిన మృతదేహాలలో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. దక్షిణ గాజాలో తమ సైనికులు కాల్పులు జరిపారని , వైమానిక దాడులు ప్రతీకారంగా జరిగాయని ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. అయితే.. దాడుల సమయంలో పౌర ఇండ్లు ధ్వంస మయ్యాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అక్టోబర్‌లో ఇరు దేశాలు సంతకం చేసిన కాల్పుల విరమణ ఒప్పందం కూలిపోతున్నట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 10 నుంచి ఇజ్రాయిల్ దాడుల్లో 580 మంది మరణిం చినట్టు సమాచారం. రఫా ప్రాంతంలోనూ ఇజ్రాయిల్ తీవ్ర ఆంక్షలు విధించింది. ఇక్కడ రోగులను సాధారణంగా వైద్య సేవల కోసం ఈజిప్టునకు తరలిస్తారు. ఇది గాజా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత ఒత్తిడికి గురి చేస్తుంది. వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధంలో దాదాపు 72,000 మంది మరణించారు. అంతర్జాతీయ నిరసనలు ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
సీజ్‌ఫైర్ ఉన్నా… ఆగని హింసోన్మాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



