Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దహన సంస్కరాలకు వెళ్ళే బాట కూడా కబ్జా..

దహన సంస్కరాలకు వెళ్ళే బాట కూడా కబ్జా..

- Advertisement -

యర్రంబెల్లి గ్రామస్తులు….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలం యర్రంబెల్లి గ్రామంలో సుమారు 30 మంది రైతుల కలిపి సర్వే నెంబర్‌ 119, 95లో నక్ష దారి ఉందనీ , కొంత మంది బాట భూమిని కబ్జా చేస్తున్నారనీ సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..  మా బావి వద్దకు వెళ్లడం కోసం బాట లేకపోవడంతో పాటు, దహాన సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్లడం కోసం కాళీ నడకబాట సైతం కబ్జ చేశారు. ఈ నెల 27వ తేదిన ఒక అతను చని పోతే బునాదిగాని కాలువ పక్క నుంచి చుట్టు తిరిగి తీసుకెళ్లగం జరిగిందనీ,  స్థానిక తహాసిల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనీ, పాత నక్ష బాట నేపధ్యంలో రికార్డుల ప్రకారం బాట చూపించాలనీ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -