– మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు
– కమ్మర్ పల్లిలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పాడి రైతులు తమ పశువులకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు మాట్లాడుతూ ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించడం ద్వారా పాడి పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు.
జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల నోటిలో పుల్లతో చొంగ కారడం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, చూడి పశువులు అబార్షన్లు అవ్వడం వంటి లక్షణాలు ఏర్పడతాయన్నారు. రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా గాలికుంటు నివారణ టీకాలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని 83 గోజాతి, 109 గేదే జాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది వెటర్నరీ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర స్పరన్, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



