Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా

ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటా

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
నియోజకవర్గంలోని ప్రతి బిఆర్ఎస్ కార్యకర్తను కాపాడుకుంటామని, కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కుమ్మరి వెంకన్న ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మృతుని కుటుంబ సభ్యులకు 10000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.గానుగుబండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బత్తుల శివ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

అనంతరం అన్నారం గ్రామ మాజీ ఎంపిటిసి కుంచాల జనార్దన్ రెడ్డి పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య,జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, అన్నారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి, దొంగరి శ్రీనివాస్, పోగుల రామకృష్ణారెడ్డి, కడారి దాసు, మట్టపల్లి వెంకట్, తడకమళ్ళ రవికుమార్, గోపగాని రమేష్, మల్లెపాక రాములు, గడ్డం సోమేష్, జలంధర్, గునిగంటి సంతోష్, గుడిపాటి వీరయ్య, యాకూబ్, బొజ్జ సాయి కిరణ్ కొండగడుపుల వెంకటేష్, గోపగాని వెంకన్న, రామనర్సు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -