No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ప్రతి మహిళా సంఘంలో సభ్యులుగా ఉండాలి

ప్రతి మహిళా సంఘంలో సభ్యులుగా ఉండాలి

- Advertisement -

ఇంధిరా మహిళ శక్తి సంబురాల్లో ఏపీడీ సుధీర్ బాబ
బృహత్తర పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సూచన 
నవతెలంగాణ – బెజ్జంకి
: మహిళ సంఘంలో సభ్యురాలుగా లేని మహిళ ఉండొద్దని..ప్రతి మహిళ సంఘంలోకి రావాలని ఏపీడీ సుధీర్ బాబు మహిళలకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కళజాత బృందం అధ్వర్యంలో ఇంధిరా మహిళ శక్తి సంబురాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీడీ సుధీర్ బాబు హజరై మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం బృహత్తర పథకాలు రూపొందిస్తుందని, మహిళలు వాటిని సద్వినియోగపర్చుకోవాలని కోరారు.

పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం వంటి కార్యక్రమాల్లో మహిళలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. శ్రీనిధి, కిషోర బాలికల సంరక్షణ, వడ్డీలేని ప్రభుత్వ బ్యాంక్ లింకేజీ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడాలని తెలిపారు. అంతకుముందు మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై కళాజాత బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. డీపీఎం విధ్యాసాగర్, ఎంపీడీఓ ప్రవీన్, ఎపీఎం నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, సీసీలు, వీఓఏలు రామంచ అంజలి, మహిళ సంఘాల సభ్యులు, గ్రామస్తులు హజరయ్యారు.

మహిళలను నిలబెట్టడం గౌరవమా..!

ఇంధిరా మహిళ శక్తి సంబురాల కార్యక్రమానికి హజరైన మహిళలకు సంబంధిత శాఖ అధికారులు కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సుమారు గంటల తరబడి గ్రామ పంచాయతీ కార్యాలయం అవరణం వద్ద రోడ్డుపై నిలబడియున్నారు. కార్యక్రమానికి హజరైన మహిళలకు కనీస వసతులు కల్పించడకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గౌరవామంటూ మహిళల్లోనే విమర్శలు తలెత్తడం ఆశ్చర్యం. కార్యక్రమ చిట్టచివరిలో సంబంధిత శాఖ అధికారులు మహిళలు కూర్చోవడానికి కుర్చీలు అందుబాటులోకి తీసుకురావం కొసమెరుపు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad