- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఉపాధిహామీ పథకంలో జాబ్ కార్డులున్న ప్రతి కూలికి తప్పకుండా పని పనులు కల్పించాలని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఉపాధిహామీ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం గ్రామపరిధిలోని శభాష్ నగర్ లో ఏపిఓ హరీష్ తో కలిసి ఉపాధిహామీ పనులు ప్రారబించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. కూలీలకు పని ప్రదేశంలో తాగునీరు, ప్రథమ చికిత్స కీట్స్, చలువ పందిళ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. పని ప్రదేశంలో ప్రతి కూలి ముఖాన్ని ఫొటోతీసి ఎన్ఎంఎస్ యప్లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



