Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎంపీడీఓ

డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు భాగస్వాములు కావాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి అలివేలు మంగమ్మ వాడపల్లి సబ్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డిలు తెలిపారు. డ్రగ్ వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా దామరచర్లలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థులతో శుక్రవారం ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థి దశ నుండే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ మంచి అలవాట్లను అలవర్చుకొవాలని సూచించారు.

ఉపాధ్యాయులు సూచించిన అంశాలను ఆచరించి మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని తెలిపారు. చెడు స్నేహం వలన మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు బుగ్గిపాలు చేసుకోకూడదని అన్నారు. తల్లిదండ్రులు గురువులు నేర్పే నైతిక విలువలను పాటించి, సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం నార్కేట్ పల్లి-అడ్డంకి ప్రధాన రహదారిపై దామరచర్లలో మానవహారం నిర్వహించి డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, ప్రధానోపాధ్యాయులు బండా వెంకటరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఠాగూర్ సురేంద్ర సింగ్  ప్రత్యేక అధికారిని అరుణ, ఏపియం దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img