నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సిపిఆర్ శిక్షణ అందరికి అవసరమేనని, ఎదో ఒక సమయంలో ఉపయోగపడవచ్చని అందరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ హేమంత్ కుమార్ అన్నారు. గురువారం రాయగిరిలోని మసుకుంట రైతు వేదికలో గురువారం సిపిఆర్ (కార్డియో పల్మనరీ రెసిసి అవగాహన కార్యక్రమానికి హాజరై, శిక్షణ ఇచ్చారు. సిపిఆర్ (కార్డియో పల్మనరీ రెసిసి టేషన్) అవగాహనలో భాగంగా మండల ఉద్యోగులకు ఆరోగ్య వైద్య సిబ్బందికి, ఆశలకు శిక్షణ ఇచ్చారు. అందరికీ అవసరము అని డాక్టర్ హేమంత్ అన్నారు.
ఆకస్మిక గుండెపోటు వచ్చినప్పుడు అత్యవసర వైద్య చికిత్స ద్వారా గుండె తిరిగి కొట్టుకునే వరకు సిపిఆర్, మెదడు, ఇతర అవయవాలకు ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని ప్రవహించేలా చేస్తుంది. గుండె ఆగిపోయినప్పుడు శరీరానికి ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తము లభించదు. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం లేకపోవడం వల్ల కొన్ని నిమిషాలలో మెదడు దెబ్బతింటుంది. అందువల్ల సిపిఆర్ అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని, ఎలా సిపిఆర్ చేయాలో శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.
లైన్ డిపార్ట్మెంట్ అయిన పంచాయతీ సెక్రటరీ లకు,ఫీల్డ్ అసిస్టెంట్ లకు, అంగన్వాడీ ఉద్యోగులకు, ఆరోగ్య వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, బోల్లెపల్లి వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి డాక్టర్ మురళీమోహన్ పంచాయతీ సెక్రటరీలు, వైద్య ఆరోగ్య ,అంగన్వాడీ,ఆశ సిబ్బంది పాల్గొన్నారు.