దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ధీóరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో, ఈ నెల 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
ఈ నేపథ్యంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, ‘ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్‌ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్‌ఫార్మర్స్‌నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్‌ఫార్మర్. రష్మికలాగే తన క్యారెక్టర్‌లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. గతంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి కాకుండా కథ బాగా నచ్చి మేం ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాం. రష్మిక ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు. కాబట్టి ఆ కతజ్ఞతతో రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం. ఇందులో రష్మిక నటన అత్యద్భుతం. అనూ ఇమ్మాన్యుయెల్ కూడా బాగా నటించింది’ అని తెలిపారు.
‘ఈ సినిమా కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్‌ను తీసుకుంటారు. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్‌కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్‌తో స్ఫూర్తి పొంది రాసినా, మిగతా అంతా స్క్రిప్ట్ చేసుకున్నదే. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ కథ. సినిమా చూసిన ప్రేక్షకులంతా ఈ కథకు రిలేట్ అవుతారు. తమకు తెలిసిన వారి ప్రేమ కథలు గుర్తొస్తాయి. హేషమ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. అల్లుఅరవింద్ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన సూచనలతో చాలా జాగ్రత్తగా అన్ని ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా ఫలితం మీద చాలా నమ్మకంతో ఉన్నాం’ అని నిర్మాత విద్యా కొప్పినీడి చెప్పారు.
ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



