Friday, February 13, 2026
E-PAPER
Homeకరీంనగర్పరకాలలో ఉత్కంఠభరితంగా మున్సిపల్ కౌంటింగ్..

పరకాలలో ఉత్కంఠభరితంగా మున్సిపల్ కౌంటింగ్..

- Advertisement -

17వ వార్డులో ‘ఒక్క ఓటు’ విజయం!
నవతెలంగాణ -పరకాల 

పరకాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా ప్రారంభమైంది. ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రం వద్ద రాజకీయ సందడి నెలకొంది. తొలి రౌండ్ ఫలితాలు వెలువడటంతో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. మొదటి రౌండ్ ముగిసే సమయానికి అందిన సమాచారం ప్రకారం, ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. బిజెపి 03 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది.  కాంగ్రెస్ 02 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ 02 స్థానాల్లో విజయం సాధించింది.
ఒక్క ఓటుతో గెలుపు – ఉత్కంఠ రేపిన 17వ వార్డు : ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది 17వ వార్డు ఫలితం. ఇక్కడ అభ్యర్థుల మధ్య పోరు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర సాల్మన్ తన సమీప ప్రత్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థిని శనిగరపు రజినీ నవీన్‌పై కేవలం ఒక్క ఓటు స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఒక్క ఓటుతో గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. మిగిలిన వార్డుల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల వెల్లడితో పట్టణంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -