Monday, November 10, 2025
E-PAPER
Homeఆటలుఉత్సాహంగా పికిల్‌బాల్‌ పోటీలు

ఉత్సాహంగా పికిల్‌బాల్‌ పోటీలు

- Advertisement -

డిసెంబర్‌ 13న గ్రాండ్‌ ఫైనల్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పికిల్‌బాల్‌ లీగ్‌ (హెచ్‌పీఎల్‌) పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని రిజర్వ్‌ స్పోర్ట్స్‌ ఎరీనాలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్లే ఆఫ్స్‌లో చోటు కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఈ వీకెండ్‌లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో దాసోస్‌ డైనమోస్‌పై క్రెడికాన్‌ డైనమోస్‌ పైచేయి సాధించగా.. కీర్తి వారియర్స్‌పై రాఫ్టర్స్‌ గెలుపొందింది.. స్టారీ స్మాషర్స్‌తో మ్యాచ్‌లో ది తెరమోర్‌ టైటాన్స్‌ సాధికారిక విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఏడు మ్యాచ్‌ల పోరులో నంది చార్జర్‌పై ఆల్‌ స్టార్స్‌ పైచేయి సాధించింది. పికిల్‌బాల్‌ మ్యాచ్‌లకు సినీ నటులు తరుణ్‌ భాస్కర్‌, సుశాంత్‌.. బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి సహా మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు హాజరయ్యారు. హెచ్‌పీఎల్‌ తొలి సీజన్‌ గ్రాండ్‌ ఫైనల్‌ డిసెంబర్‌ 13న జరుగుతుందని నిర్వాహకులు యశ్వంత్‌ బియ్యాల తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -