- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యూపీ ఝాన్సీలోని బారుసాగర్ పీఎస్ ప్రాంతంలో భూతవైద్యం నెపంతో ఓ తాంత్రికుడు 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు బాలిక కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతోంది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్‌కు చెందిన హర్భజన్ అనే తాంత్రికుడిని మంగళవారం ఇంటికి పిలిపించారు. బాలికను చూసిన తాంత్రికుడు ఆమెకు దెయ్యం పట్టిందని, దానిని వదిలిస్తానని చెప్పి ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి.. బట్టలు విప్పించి అసభ్యంగా తాకాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- Advertisement -



