Tuesday, March 3, 2026
E-PAPER
Homeక్రైమ్పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. భారీగా మంటలు

పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. భారీగా మంటలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో ప్లాస్టిక్ సామగ్రి ఉండటంతో మంటలు చెలరేగి, భారీగా పొగలు అలముకున్నాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.వేసవి కాలం సమీపిస్తుండటంతో గోదాంలో పెద్ద ఎత్తున కూలర్లు, వాటికి సంబంధించిన ప్లాస్టిక్ బాడీలు నిల్వ ఉంచడంతో మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -