- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. బట్టీ పేలుడు ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీ అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన సమయంలో బట్టీల వద్ద దాదాపు 50 మంది పని చేస్తున్నట్లు సమాచారం.
- Advertisement -



