Thursday, September 11, 2025
E-PAPER
Homeఖమ్మంసీఐటీయూ ఓపెన్ బ్యాలెట్ కు విశేష స్పందన..

సీఐటీయూ ఓపెన్ బ్యాలెట్ కు విశేష స్పందన..

- Advertisement -

యూనియన్ లకు అతీతంగా ఓటింగ్ లో పాల్గొన్న కార్మికులు..
నవతెలంగాణ – మణుగూరు
సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం కల నెరవేర్చాలని , సింగరేణి వ్యాప్తంగా 25 డిమాండ్లతో కూడిన బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమం మణుగూరు డివిజన్ లో విశేష స్పందన లభించింది. గురువారం ఉదయం 6 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. ఓ సీటు ఓసి 4 కెపియుజి, జియం కార్యాలయం ఏరియా వర్క్ షాప్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం 6 వరకు నిరంతరాయంగా కొనసాగింది. 35% లాభాల వాటా, సొంత ఇంటి కల, పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ మారు పేర్లు, పని స్థలాల్లో, నివాస ప్రాంతాల్లో సమస్య పరిష్కారానికి దశల వారి ఆందోళన భాగంగా .. 11 న మైన్స్ డిపార్ట్మెంట్లలో బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

సింగరేణి కాలరీస్ ఎంప్లాయి స్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు వల్లూరు వెంకటరత్నం మాచారపు లక్ష్మణరావు ఆధ్వర్యంలో  అధిక సంఖ్యలో సింగరేణి కార్మికులు ఓటు వేసి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా  ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్,  సిఐటియు సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు, ఏఐసిఎఫ్ ఆల్ ఇండియా కమిటీ సభ్యులు ముత్యాల సుమన్, నల్లెల  విల్సన్, రైతు సంఘం మండల అధ్యక్షులు బొల్లం రాజు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నైనారపు నాగేశ్వరరావు,ముజఫర్, కిరణ్, రాములు సింగరేణి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -