Wednesday, February 11, 2026
E-PAPER
Homeకరీంనగర్పరకాల మున్సిపాలిటీలో 'అంతుచిక్కని' ఓటరు నాడి.. 

పరకాల మున్సిపాలిటీలో ‘అంతుచిక్కని’ ఓటరు నాడి.. 

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
మున్సిపల్ ఎన్నికల వేళ పరకాల పట్టణ రాజకీయం రసవత్తరంగా మారింది. గెలుపు గుర్రాలు ఎవరనేది అంచనా వేయడం రాజకీయ విశ్లేషకులకు కూడా సాధ్యం కావడం లేదు. పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రచారం చివరి దశకు చేరుకుంటున్నా, ఓటరు ఎటు మొగ్గు చూపుతున్నాడో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాన వార్డుల్లో నెలకొన్న సమీకరణలు గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ 1, 6, 14, 10, 13, 18, 19 వార్డులపై గట్టి ఆశలు పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీ 2, 3, 5, 8, 11, 16, 17, 20 వార్డుల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది.4, 9, 22 వార్డుల్లో బిజేపి ఆశలు పెట్టుకుంది. అయితే, పలు వార్డుల్లో త్రిముఖ పోటీ (ట్రైయాంగిల్ ఫైట్) నెలకొనడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. 7, 12, 21, వార్డుల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. మరికొన్ని చోట్ల ముఖాముఖి పోరు కనిపిస్తోంది. 15వ వార్డులో బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి తలపడుతుండగా 22 వార్డులో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో తెలియాలంటే ఈ నెల 13న  ఫలితాలు వెలువడె వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -