నిందితుని హార్డ్‌డిస్క్‌లో 21వేల సినిమాలు
బెట్టింగ్ యాప్‌ల ద్వారా రూ. 21కోట్లు
వెలుగులోకి సంచలన విషయాలు
సైబర్‌నేరస్తులకు రూ.56 లక్షల విలువైన వినియోగదారుల డేటా విక్రయం
అవసరమైతే ఈడీ, సీబీఐ సహకారం
కోవిడ్ సమయంలో ఇండ్లకు పరిమితం కావడంతో ప్లాన్
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ- సిటీబ్యూరో/బంజారాహిల్స్
పైరసీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఐ బొమ్మ ఎట్టకేలకు బంద్ అయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ పైరసీ రాకెట్‌ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఛేదించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించిన ఈ కేసులో ప్రధాన నిందుతుడితో సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, దిల్‌రాజు, నరేశ్‌బాబు, పలువురు పోలీస్ అధికారులతో కలిసి హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు. ఎవరో సమాచారం ఇస్తే ఇమ్మడి రవిని అరెస్టు చేయలేదని, పోలీసులే కష్టపడి నిందితుడిని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారని స్పష్టం చేశారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) యాంటీ-వీడియో ఫైరసీ సెల్‌నుంచి ఫిర్యాదు అందిందన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగు చూశాయన్నారు.
2010లో వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేకత సాధించిన రవి ‘ఈఆర్ ఇన్‌ఫోటెక్’ అనే పేరుతో వెబ్‌సర్వీసెస్ సంస్థను స్థాపించాడు. ఆన్‌లైన్ కంటెంట్ పెరగడం, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రజాదరణను గమనించాడు. ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్‌కు అధిక డిమాండ్‌ను చూసి ఉచితంగా నాణ్యత గల సినిమా వెబ్‌సైట్‌ను సృష్టించాడు. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లతో చేతులు కలిపాడు. కోవిడ్-19లో లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇండ్లకు పరిమితంకావడంతో, థియేటర్లు మూతపడ్డాయి.
కొత్త సినిమాలు చూడాలంటే అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు సబ్‌స్క్రైబ్ చేయాల్సి వచ్చింది. అదే అదునుగా 2019లో ఐ బొమ్మ, 2022లో బప్పమ్ అనే రెండు వెబ్‌సైట్లను సృష్టించాడు. అందులో అనధికారింగా సినిమాలను అప్‌లోడ్ చేసేవాడు. ఈ వెబ్‌సైట్‌లో కొత్తగా విడుదలైన థియేట్రికల్, ఓటీటీ చిత్రాలను హెచ్‌డీ నాణ్యతతో ఉంచేవాడు. నిందితుడు 56 వెబ్‌సైట్ల ద్వారా అక్రమంగా పైరసీ సినిమాలను ఫ్రీగా చూపిస్తూ దాదాపు 56లక్షల మంది డేటాను తస్కరించాడు. ఆ డేటాను సైబర్ నేరస్తులకు విక్రయించాడు. నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లలో మొత్తం 21వేల పైరసీ సినిమాలున్నాయి. వీటిలో 1972 నాటి ‘ది గాడ్ ఫాదర్’ నుంచి 2025 నాటి ‘ఓజీ’ దాకా సినిమాలున్నాయి. పైరసీల ద్వారా రూ.21కోట్లు సంపాదించాడు. బీఎస్‌సీ కంప్యూటర్ పూర్తిచేసిన రవి 2022కు ముందు ఓ ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న రవి.. అదే సంవత్సరం దాదాపు రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు.
2022 నుంచే రవి కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు. పోలీసులకు చిక్కకుండా నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌తోపాటు వివిధ దేశాల్లో భౌతిక సర్వర్లను ఏర్పా టు చేశాడు. 900కుపైగా వెబ్‌సైట్లను సృష్టించాడు. నిందితుడి వెబ్‌సైట్లు నెలకు 5 మిలియన్లకుపైగా వినియోగదారులను నమోదు చేశాయి. అతని బ్యాంక్ ఖాతా లు, క్రిస్టోకరెన్సీ వాలెట్లలో ఉన్న నిధులను పోలీసులు ఫ్రీజ్ చేశారు. భారత్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకోవడానికి మూడు రోజుల క్రితమే భారత్‌లో అడు గుపెట్టినట్టు సమాచారం రావడంతో పోలీసులకు చిక్కాడు. కరేబియన్ దీవుల్లో రవి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. రవికి సహకరించిన నెల్లూరుకు చెందిన దుద్దెల శివాజీ, పుణేకు చెందిన సుసర్ల ప్రశాంత్‌ను సెప్టెంబర్ 24న పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అవసరమైతే ఈడీ, సీబీఐ సహకారం తీసుకుంటామని సీపీ తెలిపారు. పైరసీని ప్రొత్సహించొద్దని సీపీ కోరారు.
కళాకారుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తూ.. : సినీ నటుడు చిరంజీవి
ఇంత మంది కష్టాన్ని, కళాకారుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తూ దోచుకుం టుంటే తమకు చాలా కష్టంగా ఉంటోందని సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. గత సీపీ సీవీ ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ ఎంతో కృషిచేసి నిందితుడిని పట్టుకోవడం తమకు ఊరటనిచ్చిందన్నారు. ప్రజలు కూడా సినిమా మాది అని భావించి, పైరసీ చూడొద్దని కోరారు. పోలీసులకు ఛాలెంజ్ విసిరిన పైరసీ రాకెట్ నిందితుడిని అరెస్టు చేయడం సినిమా క్లైమాక్స్ లాగా ఉందని సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అన్నారు. రవిని హైదరాబాద్ పోలీసు లు అరెస్టు చేసిన తర్వాత చెన్నై నుంచి తన స్నేహితుడు ఫోన్ చేసి ‘మేం చేయలేని ది మీరు చేశారు’ అన్నాడన్నారు. డీసీపీ ధార కవిత మాట్లాడుతూ.. నిందితుడు రవి టెలీగ్రామ్ ద్వారా పైరసీ మూవీ కోసం వెతకడం, ఓటీటీ సర్వర్లు క్రాక్ చేయడం ద్వారా సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నాడని వివరించారు. గూగుల్ డేటా సెంటర్‌తో మాట్లాడి, క్లౌడ్ ప్లేర్ వారి సహకారంతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు.



