నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఈనెల 6న సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరం స్తున్నట్లు ఆస్పత్రి సూపరి డెంటెడ్ శ్రీనివాసరావు, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తారా సింగ్ లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ & ఏరియా ఆస్పత్రి అచ్చంపేట వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి చికిత్స శిబిరము నిర్వహిస్తున్నారు.
ఈ శిబిరంలో రోగులకు ప్రత్యేక కంటి పరీక్షలు, సాధారణ పరీక్షలు నిర్వహించి ,అందులో అవసరమైన వారికి, క్యాట్రాక్టు పొర గల వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు మహబూబ్ నగర్ ఏనుగొండ లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో నిర్వహించ నున్నట్లు తెలిపారు. రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వార ఏనుగొండకు పంపనున్నట్లు తెలిపారు.రోగులు ముందుగా బి.పి,షుగర్ పరీక్షలు చేసుక్కొని రిపోర్టు వెంట తెచ్చుకోవాలని తెలిపారు.
ఈ ప్రాంత రోగులు ఆధార్ కార్డు,రేషన్ కార్డు,ఓటర్ కార్డు,ఏదేని గుర్తింపు కార్డు అయన జిరాక్స్ కాపీ, ఫోన్ నెంబర్ ని తమ వెంట తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. ఆపరేషన్ అయిన తర్వాత తేదీ 8న బుధవారం ఉదయం 9.00 గంటలకు ఏరియా ఆసుపత్రి అచ్చంపేట దగ్గర విడిచి పెట్టబడును. అని తెలిపారు.



