సీఎం, మంత్రుల సహకారంతో ములుగు జిల్లా అభివృద్ధి : మంత్రి ధనసరి అనసూయ సీతక్క
నవతెలంగాణ – ములుగు
ములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లి ఆలయం వద్ద అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామనిరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఆదివారం మలుగు జిల్లా కేంద్రం లోని గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద రూ.45లక్షలతో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను కలెక్టర్ దివాకర్ టిఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవిచంద్రర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… ములుగు జిల్లా సమీపం లోని గట్టమ్మ గుట్ట వద్ద నిర్మించనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేదతీరే అవకాశం ఉందని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జికి నిధులు సరిపోను పక్షంలో అదనపు నిధులు కేటాయించ డానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారం తో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా అభివద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు.



