Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలి

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలి

- Advertisement -

డిపిఓ శ్రీరాములు..
నవతెలంగాణ – చారకొండ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిపిఓ శ్రీరాములు అన్నారు. శనివారం మండలంలోని కమాల్ పూర్ తాండ, గైరాన్ తండా గ్రామంలో పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీ ఓ నారాయణతో కలిసి పంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కు గ్రామాల్లో ఓటర్ జాబితాను క్షుణంగా పరిశీలించాలని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో కూలిపోయిన ఇళ్లను గుర్తించాలని అన్నారు. శిథిలావస్థకు చేరి ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి వారికి ప్రత్యమ్యాయం చూపించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతిరోజు పారిశుద్ధ పనులు చేపట్టాలని ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad