- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు. తన ఫోటోను వాట్సాప్‌లో డీపీగా పెట్టుకుని, నకిలీ ఖాతాల ద్వారా తెలిసిన వారికి సందేశాలు పంపుతున్నారని, ఇది పూర్తిగా మోసపూరితమని ఆయన తెలిపారు. ఇలాంటి సందేశాలకు స్పందించవద్దని, ఆ నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లకు వ్యక్తిగత వివరాలు, డబ్బులు ఇవ్వొద్దని, నకిలీ ఖాతాలు కనిపిస్తే 1930కి కాల్ చేసి లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు.
- Advertisement -



