– వారంలో 2.18 బిలియన్ డాలర్ల తగ్గుదల : ఆర్బీఐ వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశ విదేశీ మారకం నిల్వల్లో మరోమారు తగ్గుదల చోటు చేసుకుంది. అక్టోబర్ 10తో ముగిసిన వారంలో 2.18 బిలియన్ డాలర్లు తగ్గి 697.78 బిలియన్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఇది ఇంతక్రితం వారం అక్టోబర్ 3న నమోదైన 699.96 బిలియన్లతో పోల్చితే తగ్గుదలను సూచిస్తుందని పేర్కొంది. ఫారెక్స్ నిల్వలలో ప్రధాన భాగం అయినా విదేశీ కరెన్సీ ఆస్తులు సమీక్షా వారంలో 5.61 బిలియన్ డాలర్లు తగ్గి 572.10 బిలియన్లకు పరిమితమయినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ ఆస్తులలో యూరో, యెన్, పౌండ్ వంటి కరెన్సీలు డాలర్‌తో పోలిస్తే విలువలో హెచ్చు తగ్గులు చెందడం ఈ తగ్గుదలకు కారణం. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ఈ విలువ తగ్గింది. అదే సమయంలో బంగారం నిల్వలు 3.60 బిలియన్లు పెరిగి 102.37 బిలియన్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డిఆర్) 18.68 బిలియన్ డాలర్లకు తగ్గాయని వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో భారతదేశ నిల్వలు 36 మిలియన్ డాలర్లు తగ్గి 4.63 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి.
విదేశీ మారకం నిల్వల్లో పతనం
- Advertisement -
- Advertisement -