నవతెలంగాణ – రాయపర్తి
వ్యవసాయ క్షేత్రాల విద్యుత్ మోటార్లకు నాణ్యమైన విద్యుత్ ను అందించడానికి పొలం బాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు విద్యుత్ శాఖ టెక్నికల్ డిఈ ఆనందం తెలిపారు. గురువారం మండలంలోని పెర్కవేడు గ్రామంలో విద్యుత్ శాఖ పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. లూజ్ లైన్స్ మరమ్మతు చేయడానికి పోల్స్, కొత్త సిఐ ఎర్త్ పైపులు ఏర్పాటు చేశారు. ఏబీ స్విచ్, డిటిఆర్ యొక్క చిన్నాచిన్న మరమ్మతులు చేసి సరిదిద్దారు. విద్యుత్ అంతరాయం కాకుండా కావలసిన పనులు చేపట్టి పూర్తిచేశారు. అనంతరం డిఈ మాట్లాడుతూ.. విద్యుత్ సంబంధిత సమస్యలను రైతులు నేరుగా అధికారులకు తెలియజేయాలని చెప్పారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా, కెపాసిటర్ల ఉపయోగం, ఓల్టేజీ సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్ నిర్వహణ వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. వర్షాకాలం విద్యుత్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని రైతులు ట్రాన్స్ ఫార్మర్ ల వద్దకు వెళ్లి మరమ్మతు చేసే ప్రయత్నం చేయరాదని సూచించారు. విద్యుత్ సమస్యలు ఉంటే రైతులు 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా, రైతులు విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదిక అవుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఆపరేషన్ డి ఈ బిక్షపతి, ఎడిఈ నటరాజ్, ఎఈ రవళి, సబ్ ఇంజనీర్ విక్రమ్, విద్యుత్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందించడానికే పొలం బాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES