- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన ఆకుల ఓదెలు (63) అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల పూర్తి వివరాలు ప్రకారం.. ఓదెలు ఉదయం తన చెనులో కూరగాయలు కొస్తున్న నేపథ్యంలో చెనులో ఉన్న విద్యుత్ తీగ తగిలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఏడాది క్రితం మృతుని భార్య అనారోగ్యంతో మృతి చెంది, ఇప్పుడు అతడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై శ్లోక సముద్రంలో మునిగిపోయారు.
- Advertisement -