- Advertisement -
- ట్రాన్స్ పార్మర్ ఎక్కి ప్యూజ్ వేయబోయి కరెంటు తీగల మీదనే మృతి
నవతెలంగాణ – పెద్దవూర
ట్రాన్స్ పార్మర్ ఎక్కి ప్యూజ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలం లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 07:00 గంటల సమయంలో పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బొంగారాల వెంకటయ్య ( 55) అను అతను తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళినాడు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ కొట్టి వేసినందున దానిని జాయింట్ చేయడానికి కాను అతను ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసినాడు.కానీ ప్రమాదవశాత్తు ఒక ఫేసు వైరు కరెంటు వైర్ నుండి విడిపోలేదు.
దానిని వెంకటయ్య గమనించకుండా ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఫీజు వైరు జాయింట్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అతనికి కరెంట్ షాక్ తగిలి ట్రాన్స్ ఫార్మర్ మీదనే అక్కడికక్కడే చనిపోయారు. అట్టి విషయాన్ని పక్కనే వున్న ఆడెపు సైదులు అనే రైతు చూసి మృతుని భార్య బొంగరాల నాగమ్మకు, గ్రామస్తులకు సమాచారం అందజేశారు. అనంతరం వారు అక్కడికి వెళ్లి మృతుడిని చూసి కరెంటు డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చినారు. మృతుడి భార్య బొంగరాల నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కలరని తెలిపారు.
- Advertisement -