Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్ఫార్మర్ రిజిస్ట్రీ సద్వినియోగం చేసుకోవాలి..

ఫార్మర్ రిజిస్ట్రీ సద్వినియోగం చేసుకోవాలి..

- Advertisement -

 మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీలో  రైతు వారీగా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందన్నారు. భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -