ఎకరానికి రైతులకు రూ.30,000 కౌలు రైతులకు రూ.50,000 నష్టపరిహారం ఇవ్వాలి
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వైరా తహశీల్దార్ కు వినతి
నవతెలంగాణ-వైరాటౌన్
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, ఆ పంటలను సర్వే జరిపి ఎకరానికి రైతులకు రూ.30,000, కౌలు రైతులకు రూ.50,000 నష్టపరిహారం అందించాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) వైరా పట్టణం, రూరల్ మండల కమిటీల ఆధ్వర్యంలో అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ వైరా తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. తూఫాన్ వలన వరి కోత సమయంలో క్రింద పడి మొలకలు వచ్చాయని, కొన్ని పంటలు ఎందుకు పనికి రాకుండా పోయాయని అన్నారు. వరి, పత్తి, కూరగాయలు, ఆకుకూరలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ముందస్తుగా కౌలు చెల్లించి పంటలు పండించారని, పంట చేతికొచ్చే సమయానికి తుఫాను ప్రభావం వల్ల రైతులను తీవ్రంగా నష్టపోయారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన దెనబ్బతిన్న అన్ని పంటలను సర్వే చేసి ఎకరానికి రైతులకు రూ.30,000 కౌలు రైతులకు రూ. 50000 చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలో పంట ముప్పై మూడు శాతం దెబ్బతింటేనే నష్టపరిహారం అందించే నిబంధనలు సడలించాలని, సిసిఐ కొనుగోలు నిబంధనలు సడలించి రంగు మారిన పత్తిని, ధాన్యాన్ని, మొక్కజొన్న పంటలను మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణం, రూరల్ కార్యదర్శులు చింతనిప్పు చలపతిరావు, బాణాల శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా మణి, తోట నాగేశ్వరరావు, మాగంటి తిరుమలరావు, నాయకులు గుడిమెట్ల రజిత, హరి వెంకటేశ్వరరావు పైడిపల్లి సాంబశివరావు గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, రాచబంటి బత్తీరన్న, షేక్ నాగుల్ పాషా, బాజోజు రమణ, కిలారు శ్రీనివాసరావు, కారుమంచి జయరావు, షేక్ మజీద్, కామినేని రవి, తోట కృష్ణవేణి, అనుమోలు రామారావు, షేక్ మజీద్ బి, మాడపాటి సుజాత, నర్వనేని ఆదిలక్ష్మి, చావ కళావతి, మల్లెంపాటి రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, మాడపాటి మల్లికార్జునరావు, షేక్ జమాల్ సాహెబ్, సంక్రాంతి పురుషోత్తమరావు, ఏరువ నిరశింహారావు, పారుపల్లి శ్రీనాథ్ బాబు, కొత్త సీతారామయ్య, మాడపాటి రామారావు, ఓర్సు సీతారాములు, యనమద్ది రామకృష్ణ, నల్లమల కోటేశ్వరరావు, గరిడేపల్లి సుబ్బారావు, షేక్ కాజామియా, నారికొండ అమరేందర్, అమరనేని కృష్ణ, వడ్లమూడి మధు, గుత్తా వాసు, నూకల వెంకటేశ్వరరావు, వేల్పుల మైఖేల్, పాసంగులపాటి చలపతిరావు, షేక్ అబ్దుల్ రహిమాన్, షేక్ జానిమియా, షేక్.బిలాల్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



